సచిన్‌ను ఆహ్వానించిన పీవీ సింధు జంట..! 13 d ago
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ నెలలో ఆమె హైదరాబాద్‌లో నివసించే వెంకట దత్త సాయితో ఏడు అడుగులు వేయబోతుంది. 22వ తేదీన ఉదయపూర్‌లోని లేక్స్ నగరంలో వివాహం జరుగనున్నది. ఈ క్రమంలో ఆదివారం కాబోయే భర్తతో కలిసి భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ను కలిశారు. సింధు, వెంకట దత్త సాయి జోడీ సచిన్ ను తమ పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సచిన్ సోషల్ మీడియా వేదికగా ఫొటోను షేర్ చేశారు.